‘పుష్పక విమానం’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’ రిలీజ్‌కు రెడీ అవుతుంది. నవంబర్‌12న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్ల చిత్ర బృందం ప్రకటించింది. దామోదర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘కల్యాణం’పాట సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే.
‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను ప్రముఖ గాయకుడు సిద్‌శ్రీరామ్‌, మంగ్లీ పాడారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించారు. ఆనంద్‌కు జోడీగా గీతా షైనీ నటించింది. విజయ్‌ దేవరకొండ సమర్పణలో కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌, టాంగా ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.