విఆర్ఏ లు జీతభత్యాలపై చేస్తున్న నిరసనకి మద్దతు తెలిపిన పుట్టపర్తి జనసేన

పుట్టపర్తి, రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏ లు వారి జీతభత్యాలపై చేస్తున్న నిరసన కార్యక్రమానికి శనివారం పుట్టపర్తి నియోజవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలో విఆర్ఏ ల అధ్యక్షులు పెద్దన సమక్షంలో 12వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతున్న సందర్భంగా. కొత్తచెరువు మండల జనసేన పార్టీ తరపు నుంచి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివ ప్రసాద్ మాట్లాడుతూ 2017 లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చిన కొద్ది రోజుల్లోనే వారి వేతనాన్ని 10 వేల నుండి 15000 పెంచుతామని వాగ్దానం చేశారు. అది పెంచకపోగా, వారి జీతాలను తగ్గించడం అమానుషం. నిత్యవసర వస్తువులు ప్రతి ఒక్కటి ఆకాశాన్నంటాయి ఈ 3 సంవత్సరాలలో ఇలాంటప్పుడు పదివేల రూపాయల వేతనంతో ఏ విధంగా కుటుంబాన్ని గడపగలరు ఒకసారి ముఖ్యమంత్రిగా ఆలోచించాలి. విఆర్ఏ లకు 21000 గౌరవ వేతనంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. విఆర్ఏ లకు వారి సమస్యలపై పరిష్కారం తీసుకున్నాను సమక్షంలో రాబోవు రోజుల్లో వారు ఎటువంటి ఉద్యమాలు చేపట్టిన జనసేన పార్టీ తరపు నుంచి మేము అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ నాయకులు, ఓడిశి మండలం అధ్యక్షుడు మేకల ఈశ్వర్, కొత్తచెరువు మండలం నాయకులు బాలినేని గంగాద్రి, ముత్తా నరేంద్ర, దడ్డిగుంట నరేంద్ర, పూల రెడ్డప్ప, రామంజి, రాంప్రసాద్, గంధోడి సతీష్, పేట రాము, విజయ్, జనార్దన్ తదితర నాయకులు పాల్గొన్నారు.