రహదారి పనులను పరిశీలించిన పివిఎస్ఎన్ రాజు

చోడవరం, గత ఐదు సంవత్సరాలుగా ధ్వంసం అయిపోయిన బిఎన్ రోడ్డులో భాగమయిన నర్సీపట్నం – వడ్డాది రహదారిలో ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులును తొలగించే క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సీపట్నం – వడ్డాది మార్గంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, శరవేగంతో తారు రోడ్డు పనులు అవుతున్నాయని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు తెలిపారు. ప్రస్తుతం అర్జాపురం నుండి రోలుగుంట మధ్యలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను గురువారం వ్యక్తిగతంగా పరిశీలించిన రాజు అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడడం జరిగింది. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో అర్జాపురం నుండి నుండి రోలుగుంట మధ్య తారు రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని, బిఎన్ రోడ్డులో ప్రజలకు ప్రయాణపు కష్టాలు తొలగనున్నాయని అన్నారు. గ్రామాల మధ్యలో సిసి రోడ్ నిర్మాణం పనులు తొందరలోనే ప్రారంభం కాబోతున్నాయని కాంట్రాక్టర్ తెలియజేశారన్నారు.

Share this content:

Post Comment