ఆంధ్రప్రదేశ్ విధానమండలి సభ్యులుగా (ఎమ్మెల్సీ) ప్రమాణస్వీకారం చేసి తొలిసారి పిఠాపురం పర్యటనకు విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుని మర్యాదపూర్వకంగా పిఠాపురంలో కలిసిన చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు. ఈ సందర్భంగా నాగబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరలోనే చోడవరం నియోజవర్గం పర్యటనకు రమ్మని కోరడం జరిగింది. ఈ ఆహ్వానానికి స్పందించిన నాగబాబు అతి త్వరలోనే విశాఖపట్నం పర్యటనలో భాగంగా చోడవరం విచ్చేస్తానని జనసైనికులను వీర మహిళలను కలుస్తానని, పార్టీ బలోపేతానికి ప్రజా సంక్షేమానికి కలిసి పని చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో ప్రజలకోసం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న పివిఎస్ఎన్ రాజుని నాగబాబు అభినందించారు.
Share this content:
Post Comment