అమరావతిలో క్వాంటం విప్లవానికి శ్రీకారం

*నేషనల్ వర్క్‌షాప్‌లో చంద్రబాబు, ప్రపంచ దిగ్గజాలు

అమరావతిలో నిర్వహించిన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్‌షాప్ టెక్ రంగంలో నూతన యుగానికి నాంది పలికింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరై, స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఐబీఎం సంస్థ ప్రదర్శించిన ప్రోటోటైప్ క్వాంటం కంప్యూటర్‌ను పరిశీలించిన సీఎం, వెంటనే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి దేశ భవిష్యత్తుకు క్వాంటం టెక్నాలజీ కీలకం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ వర్క్‌షాప్‌కు ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, టీసీఎస్ ప్రెసిడెంట్ వి.రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా, అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జె.బి.వి. రెడ్డి తదితరులు హాజరయ్యారు. స్టార్టప్‌ల నుంచి సైంటిఫిక్ అడ్వైజర్లు వరకు, దేశ విదేశాల నుండి వచ్చిన ప్రతినిధులు, అమెజాన్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ పార్క్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో, ప్రపంచంలోనూ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా మారనుందని భావిస్తున్నారు.

Share this content:

Post Comment