*డా. పర్ల దస్తగిరికి శుభాకాంక్షలు తెలిపిన రాచమడుగు సుందర్, చందు
నంద్యాల జిల్లాలో జనసేన పార్టీ ప్రజలతో నిత్యం దగ్గరగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుంటోంది. నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు ఎప్పుడైనా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాల కోసం సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా. పర్ల దస్తగిరి 50వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే దస్తగిరికి జనసేన ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అంతేకాక, నంద్యాల హరిజనపేటకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఒకరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠ్యపుస్తకాలు కొనలేని పరిస్థితిని గుర్తించి, జనసేన నాయకులు ఆమెకు ఆర్థిక సహాయం అందించి, విద్య కొనసాగించేందుకు మనోధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మెగా కుటుంబం వీరాభిమాని సురేష్ ద్వారా తెలుసుకుని చేపట్టారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, మంచి కోసం జరిగే ప్రతి పనిలో తమ వంతు పాత్రను పోషిస్తామని రాచమడుగు సుందర్, చందు తెలిపారు.
Share this content:
Post Comment