పూజా బర్త్‌డే గిప్ట్‌గా ‘రాధేశ్యామ్’ పోస్టర్, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ కాలేజ్‌గర్ల్‌ లుక్‌

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోన్న పూజ హెగ్డే నిన్న, మంగళ వారం రోజు పుట్టినరోజు వేడుక జరుపుకున్న సందర్భంగా ఆమె అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్‌ సినిమాలోంచి పూజ హెగ్డే స్టిల్ ను విడుదల చేశారు సదరు చిత్ర బృందo. ప్రభాస్‌తో నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో ప్రేరణగా నటిస్తున్న ఫస్ట్‌లుక్‌ని, చిరునవ్వులు చిందిస్తూ ఆమె కనపడుతోన్న తీరు అలరిస్తోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే పేరు ప్రేరణ అని ఈ సినియా యూనిట్ తెలిపింది. ఈ సినిమా పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో పూజ హెగ్డే ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

అలాగే అఖిల్‌కి జోడిగా నటస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలోని కాలేజ్‌గర్ల్‌ లుక్‌ని బర్త్‌డే గిప్ట్‌గా సదరు చిత్ర బృందo  విడుదల చేశాయి. కాగా, పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.