రాధిక.. చాలా సార్లు ఇబ్బంది పెట్టింది

వరలక్ష్మి శరత్ కుమార్.. ఈమె తెలియని సినీ ప్రేక్షకులు లేరు. విభిన్న పాత్రలతో అలరిస్తూ వస్తున్న ఈమె..తాజాగా రవితేజ క్రాక్ మూవీ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ లో జయమ్మ పాత్రలో అదరగొట్టింది.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లో మాట్లాడుతూ రాధికా శరత్ కుమార్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆమె నా తల్లి కాదు. కానీ.. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నా కెరీర్కు సంబంధించిన ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటుంది. అయితే.. నేను ఆమెకు ఏదైనా రహస్యం చెబితే.. దాన్ని వెంటనే లీక్ చేసేస్తుంది. అలా నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టింది.’ అని తెలిపింది వరలక్ష్మి. అయితే.. అందులో దురుద్దేశం లేదని చెప్పింది. ‘సీక్రెట్లు ఆమె కావాలని చెప్పదు. పొరపాటున జరిగిపోతుంది’ అని తెలిపింది వరలక్ష్మి.