ఈ దేశానికి రైల్వే కార్మికులు చాలా ముఖ్యం: బైరి వంశీకృష్ణ

•ఈ దేశానికి రైతులు, సైనికులు, ఎంత ముఖ్యమో రైల్వే కార్మికులు అంతే ముఖ్యం.
•రైల్వే కార్మికులు రోడ్డు ఎక్కి దీక్షలు ధర్నాలు చేయడం బాధాకరం.
•రైల్వే కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తు ప్రజలకు సురక్షితమైన సేవలు అందిస్తున్నారు.
•ఈ దేశానికి అధిక ఆర్ధిక లాభాలు రైల్వే సంస్థ నుంచే వస్తున్నాయి.
•రైల్వే కార్మికుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి.
•కాజిపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది.

కాజిపేట్, జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ సూచనలకు అనుగుణంగా గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు శ్రీ బైరి వంశీ కృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రైల్వే జేఏసీ తలపెట్టిన 30గంటల దీక్షకు సంపూర్ణ మద్దత్తు తెలపడం జరిగింది. ఈ మేరకు బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెలంగాణాను అణిచివేతకి గురిచేసారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగం ఆయన కాజిపేట్ జంక్షన్ కి అన్ని హంగులు అర్హతలు ఉన్న గత 40 సంవత్సరాల పైగా కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అదే విదంగా కాజిపేట్ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న కార్యరూపం దాల్చలేదు ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రజాప్రతినిధుల మౌనం, చట్టసభలలో కాజిపేట్ సమస్యలను లేవనెత్తకపోవడం చర్చలు జర్పకపోవడం వలన కాజిపేటకు తీరనిలోటు జరిగింది, ఇప్పుడు కొత్తగా తలెత్తిన మరో సమస్య రైల్వే కార్మికుల “లోకో పైలేట్స్ & అసిస్టెంట్ లోకో పైలేట్స్, గార్డులకు సంబందించిన ఎక్సప్రెస్ రైళ్ళ క్రూ లింక్లను కాజిపేట్ నుంచి విజయవాడ తరలించడం జరిగింది, విజయవాడకు తరలించిన క్రూ లింక్ల ఎక్సప్రెస్ ట్రైన్లను వెంటనే కాజిపేట్ క్రూ డిపోకు తరలించి రైల్వే జేఏసీ నాయకుల డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శేషాద్రి సందీప్, మహమ్మద్ ఇబ్రహీం, కొండ్రా సాయి ప్రతాప్, మెడిద ప్రశాంత్, లైదేల్లా రాకేష్, సంతోష్, నవీన్, అన్వేష్, ఉమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.