పదవి విరమణ వయోపరిమితి పెంపుదల మీ రాజకీయ లబ్ధి కోసమే: పేడాడ రామ్మోహన్

శ్రీకాకుళం, ఉద్యోగుల పదవీ విరమణ పెంచడం పై శ్రీకాకుళం జిల్లాలో ఏఐవైఫ్ ఆధ్వర్యంలో సిపీఐ కార్యాలయం నందు జిల్లా కార్యదర్శి లోకనాథ్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల అఖిలపక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐవైఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు మరియు జనసేన నాయకులు ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సి అడిగితే పదవీ విరమణ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచుతాం అనడం సరికాదని ఈ నిర్ణయం వల్ల వేలాది మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది తప్ప ఆచరణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు, సచివాలయ ఉద్యోగులకు కూడా నమ్మించి మోసం చేశారని మాట తప్పను మడమ తిప్పను అంటూనే సచివాలయ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని సచివాలయం ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్, ఎస్ఎఫ్ఐ నాయకుడు హరీష్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రవి రాధాకృష్ణలతోపాటు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.