నేటినుంచి రాజ్‌భవన్‌లో పేదలకు ‘రాజ్‌భవన్‌ అన్నం’

నేటి నుంచి రాజ్‌భవన్‌లో పేదలకు నిత్య సంతర్పణ జరుగనుంది. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ‘రాజ్‌భవన్‌ అన్నం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని నేడు రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాల్లో ప్రారంభించనున్నారు. ఇక్కడ నిత్యం 500 మందికి ఉచితంగా టిఫిన్‌, నామమాత్రపు రుసుముతో మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాన్ని కల్పించనున్నారు.