అక్టోబర్‌ 2న ‘ఆహా’లో ‘ఒరేయ్‌ బుజ్జిగా’

కోవిడ్ సమయంలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్న తెలుగు OTT ప్లాట్ ఫాం ఆహా  ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్దం అవుతోంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన రొమ్‌కామ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆహా లో విడుదల కానుంది. విజయ్‌ కుమార్‌ కొండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్‌, హెబ్బాపటేల్‌ హీరోయిన్స్‌గా నటించారు. కుమారి 21 ఎఫ్‌లో సూపర్బ్‌ కెమిస్ట్రీతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది. అభిమాన అగ్ర నటులు నటించిన క్లాసికల్‌ లైబ్రరీ ఆహా తమ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.