రాజా మీరసుధార్‌ ఆస్పత్రికి రూ. 25 లక్షల విరాళం: జ్యోతిక

తంజావూర్‌ ప్రభుత్వాస్పత్రికి ప్రముఖ సినీ నటి జ్యోతిక రూ. 25 లక్షలు విరాళం అందించారు. కొంతకాలం క్రితం  తాను నటిస్తున్న చిత్ర షూటింగ్‌ నిమిత్తం రాజా మీరసుధార్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలను చూసిన క్రమంలో శనివారం ఉదయం అగరం ఫౌండేషన్‌ ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాన్ని జ్యోతిక తరఫున దర్శకుడు ఆర్‌.శరవణన్‌ అందించారు. పిల్లల వార్డు ఆధునికీకరణ కోసం ఈ మొత్తాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతికకు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్‌ ధన్యవాదాలు తెలిపారు.