రాజమండ్రి జనసేన-టీడీపీ పార్టీలో భారీగా చేరికలు

రాజమహేంద్రవరం, స్థానిక 47వ డివిజన్లో జనసేన పార్టీ సిటీ కార్యదర్శి అల్లాటి రాజు మరియు టిడిపి నాయకులు దాసరి చిన్ని ఆధ్వర్యంలో వందలాది మంది స్థానికులు జనసేన పార్టీ రాజమండ్రి నగర ఇన్చార్జ్ అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ మరియు జనసేన-టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు సమక్షంలో జనసేన టిడిపిలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అత్తి సత్యనారాయణ ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనతో విసిగి చెందిన ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అడుగడుగునా అక్రమాలు దౌర్జన్యాలతో పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక మద్యం మత్తులో అనేకమంది పెడదారి పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో గొప్పలు చెబుతూ పన్నుల రూపంలో వైసిపి ప్రభుత్వం రెట్టింపు వసూలు చేస్తూ మధ్య తరగతి ప్రజల వెన్ను విరిచారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురి నాయకులు రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు కలసి పోటీ చేయడం చారిత్రక నిర్ణయం అన్నారు. మరో 40 రోజుల్లో ప్రజలకు మేలు చేసే టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు నగర జనసేన నాయకులు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.