జనసేన అధినేత పవన్ ను కలిసిన రాజంపేట శ్రీనివాసరాజు

  • పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై రాజు కలయిక
  • ఇరువురి నేతల మధ్య గంట పాటు భేటీ
  • త్వరలో అనుచరులతో కలిసి పార్టీలో చేరిక

రాజంపేట: జనసేన పార్టీ అధినేత కె.పవన్ కళ్యాణ్ ను రాజంపేటకు చెందిన రాష్ట్ర ది.ఆర్.డి.ఏ విశ్రాంత అధికారి యల్లటూరు శ్రీనివాసరాజు శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై కలిశారు. ఇరువురు దాదాపు గంటసేపు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు, శ్రీనివాసులు పార్టీలో చేరడానికి కారణాలను పవన్ కళ్యాణ్ కు వివరించారు. పవన్ కళ్యాణ్ శ్రీనివాస రాజుకు మరో నాలుగు సంవత్సరాల ఉద్యోగ సర్వీసు ఉండగా రాజీనామా పై ప్రశ్నించగా తాను జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి, మీ వెంట నడవడానికి రాజంపేట నుంచి ప్రత్యక్ష రాజకీయాలలోనికి అడుగుపెట్టతున్నట్లు పవన్ కళ్యాణ్ కు తెలిపారు. తనకు పార్టీలో ఎటువంటి బాధ్యతలు అప్పగించినా బాధ్యతగా పనిచేస్తానని పవన్ కళ్యాణ్ కు చెప్పినట్లు వినికిడి. శ్రీనివాసరాజు దాదాపు ఏడాది కాలంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తూ అన్ని వర్గాల వారి మద్దతు కూడ కట్టిన నేపథ్యంలో జనసేనలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ శ్రీనివాసరాజుతో జరిగిన చర్చలు సానుకూలంగా నడిచాయి. పవన్ కళ్యాణ్ జనసేనలోనికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజాసేవ చేసే నిస్వార్ధపరులు కావాలని శ్రీనివాసరాజు అభిప్రాయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ శ్రీనివాసరాజును పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కడప, అన్నమయ్య జిల్లాలలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. శ్రీనివాసరాజు తాను ప్రతిఫలం ఆశించి జనసేన పార్టీలో చేరడం లేదని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ జనసైనికునిగా కొనసాగుతానని పార్టీని బలోపేతం చేయడమే ధ్యేయమని శ్రీనివాసరాజు మీడియాకు వివరించారు.