కోవిడ్ నుంచి కోలుకున్న రాజశేఖర్

కరోనా సోకిన తర్వాత హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చేరిన టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. రాజశేఖర్‌ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. దాదాపు మూడు వారాల పాటు ఆస్పత్రిలో చేరిన తర్వాత తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌ నుండి రాజశేఖర్‌ ను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఆయన భార్య జీవిత తో కలిసి రాజశేఖర్‌ దిగిన ఫొటోను, అక్కడి వైద్య బృందంతో దిగిన ఫొటోను రాజశేఖర్‌ తన అభిమానులతో పంచుకున్నారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుండి కాపాడిన వైద్య బృందానికి జీవిత రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజులపాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్‌ కోలుకున్నారని జీవిత సంతోషాన్ని వ్యక్తపరిచారు.