అందరి కష్టం తెలిసిన వ్యక్తి రాజశేఖరం

*ప్రతి గ్రాడ్యుయేట్ అభ్యర్థిని కలిసిన ఎమ్మెల్యే తనయులు బొలిశెట్టి రాజేష్, టిడిపి వలవల బాబ్జి, బిజెపి ఈతకోట తాతాజీ

తాడేపల్లిగూడెం: అందరి కష్టం తెలిసిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖరం అని జనసేన నియోజకవర్గ నాయకుడు బొలిశెట్టి రాజేష్ అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఈతకోట తాతాజీ, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ కూటమి నాయకులతో కలిసి స్థానిక 12వ వార్డు సంజీవ్ నగర్ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, సచివాలయం, వెటర్నరీ హాస్పిటల్, కడకట్లలోనీ కోడె వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్ లోని ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులు కలిసి ఓట్లను అభ్యర్థించారు… ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి ఉద్యోగస్తులను కలిసి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుందన్నారు.. కూటమి అభ్యర్థినీ గెలిపించుకోవడం ద్వారా ఉద్యోగస్తుల సమస్యలు శాసన మండలి లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. పట్టభద్రులు అభివృద్ధిని కోరుకుంటారని వారు తైలాలకు లొంగరని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఒక్కోక్కటి గాడిలో పెట్టడం జరుగుతుందని తెలిపారు.. పట్టణంలో ఉన్న మున్సిపల్ స్కూళ్లలో సమస్యలను ఒక మెమొరండగా తమకు అందిస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశి, పుల్లా బాబి, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్రప్రసాద్, యంట్రపాటి రాజు, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకటరామయ్య, నల్లగంచురాంబాబు, అడబాల మురళి, చాపల రమేష్, నీలపాల దినేష్, బైనపాలేపు ముఖేష్, గట్టిమ్ నాని, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, అనిల్, అడ్డగర్ల సూరి, శ్రీరామ్, దస్తగిరి, కటికి రెడ్డి కల్యాణి, సుంకర ధనబాబు, లీల, శంకర్, రాజు తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, పడమ నాబ మురళి, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, తాటికాయల వీరన్న, మండ ప్రకాశ్, లీల బిజెపి నాయకులు రామగాని సత్యనారాయణ, పడాల కావ్యరెడ్డి, నారాయణ, ఎస్వీ రంగారావు, బెనర్జీ, గంగాధర్ రావ్, కంచర్ర రాజా తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment