రజినీకాంత్ సాహసం!

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా నిర్మాతలను లాభాల్లో ఉంచగల స్టామినా రజినీకాంత్ కు ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ శివ డైరెక్షన్ లో అన్నాత్తె సినిమా చేస్తున్నారు.

యంగ్ హీరోలు సైతం పరిస్థితి కంట్రోల్ ఆయిన తరువాత సినిమాల సంగతి చూద్దామని ఇంట్లోనే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సాహసం చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన నటిస్తోన్న కొత్త సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్ కొన్నాళ్లక్రితం ఆగిపోయింది. కానీ ఇప్పుడు కరోనా ఉధృతి పెరిగిన తరువాత షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున షూటింగ్ నిర్వహిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. భారీ వాహనాల మధ్య రజినీకాంత్ యాక్షన్ సీన్స్ చేస్తున్నట్లు సమాచారం. దిలీప్ మాస్టర్ డైరెక్షన్ లో ఈ ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక అన్నీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.