మహావతార్ బాబాజీ ఆశీస్సులతో రజనీకాంత్ త్వరగా కోలుకోవాలి

సూపర్ స్టార్ రజనీకాంత్ రక్త పోటులో హెచ్చు తగ్గుల వలన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. రజనీకి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. బీపీ అదుపులో లేకపోవడంతో రజనీకాంత్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

రజనీకాంత్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్టు తెలియగానే బాధపడ్డాను. ఆయనకు కరోనా లక్షణాలేమి లేవని డాక్లరు చెప్పడం ఉపశమనం కల్పించింది. రజనీకాంత్ ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన మన ముందుకు రావాలని కోరుకొంటున్నానని పవన్ పేర్కొన్నారు. మనోధైర్యం మెండుగా ఉన్న శ్రీ రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.