రాజోలు జనసేనలో చేరికలు

రాజోలు మండలం, రాజోలు గ్రామంలో వైసిపి పార్టీ నుండి విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయం కోసం ఆయన సిద్దాంతాలు నచ్చి మాజీ మార్కేట్ యార్డ్ డెరైక్టర్ బొమ్మిడి దుర్గ భవాని మహేష్ ఆధ్వర్యంలో, రాజోలు నియోజకవర్గ జనసేన, టీడిపి, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ సమక్షంలో, అడ్వకేట్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గుబ్బల రజిత, అడ్వకేట్ అనుచురి వెంకటరామయ్య మరియు వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ నెంబర్స్ అంబటి హైమావతి, పొనమండ నాగలక్ష్మి, అంబటి సత్యనారాయణ, జవ్వాది గున్నయ్య రాజు, శ్రీనివాసరావు సిట్టం, పెమ్మాడి లక్ష్మి తదితరులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.