అంజనా తనయుని కోసం అంజనీ తనయుని పూజ నిర్వహించిన రాజోలు చిరు ఫాన్స్

పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల వేడుకలలో భాగంగా రాజోలు తాలూకా వరుణ్ తేజ్ ఫాన్స్ అసోసియేషన్ అద్యక్షుడు  పైడిపర్తి రాజా మరియు అమలాపురం బిజెపి పార్లమెంటరీ అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవేమా ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడిలో చిరంజీవి పేరుమీద సహస్ర నామార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమo లో గుండాబత్తుల తాతాజీ, తుమ్మల పల్లి నారాయణ, కోళ్ళ  బాబి, తులా ఆది, ఉలిశెట్టి లక్ష్మణ రావు, ఇంటిపల్లి ఆనందరాజు మరియు కాట్రేనిపాడు మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.