ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మంగళవారం కలవడం జరిగింది. అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానానికి సరైన రోడ్డు సదుపాయం కల్పించడానికి యాభైకోట్ల రూపాయల వ్యయంతో మూడు రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన తయారుచేసి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది. ప్రతిపాదనలో అంతర్వేదిపాలెం నుండి కేశవదాసుపాలెం రోడ్డు – మిగిలిన 3.4 కి.మీ. డబల్ లేన్ రోడ్డు, సఖినేటిపల్లిలంక బోను దగ్గర నుండి అంతర్వేది గుడి వరకు డబల్ లేన్ రోడ్డు 12 కి.మీ, మల్కిపురం టౌన్లో 2 కి.మీ. విశ్వేశ్వరాయపురం వంతెన నుండి వెంకటేశ్వరస్వామి గుడి వరకు డబల్ లేన్ రోడ్డు లైటింగ్ తో సెంట్రల్ డివైడర్ వంటి అంశాలను పొందుపరచడం జరిగింది. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సుముఖంగా స్పందించడం జరిగింది. అనంతరం నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించడం జరిగింది.
Share this content:
Post Comment