కౌలు రైతు భరోసా కార్యక్రమానికి విరాళం అందించిన ర్యాలీ సతీష్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు ర్యాలీ సతీష్ బుధవారం కాకినాడలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ గారికి 10000 రూపాయల చెక్కు అందించడం జరిగింది.. వీరికి నానాజీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి వీరబాబు, వసంత గోపాల్, గుండుమెను పండు, కుర్ర శరత్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.