ఏ.కే.యూ వి.సి, రిజిస్ట్రార్ లను కలిసిన భారత విశిష్ఠ వ్యక్తి రామ్ భూపాల్ రెడ్డి

  • రామ్ భూపాల్ రెడ్డిని అభినందించిన వి.సి, రిజిస్ట్రార్ తదితరులు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం ద్వారా ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో విశిష్ట వ్యక్తులుగా సుమారు 100 మంది వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. సదరు 100 మందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి ఎంపిక కాబడిన అతి కొద్ది మంది వ్యక్తులలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలం, యడవల్లి గ్రామానికి చెందిన విశ్రాంత హెడ్మాస్టర్ ఎం. రామ్ భూపాల్ రెడ్డి సోమవారం ఉదయం ఒంగోలులోని ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్టార్ బి.హరిబాబు తదితరులను గౌరవ పూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్ భూపాల్ రెడ్డిని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వి.సి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తదితరులు భారత దేశ స్థాయిలో విశిష్ఠ వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపును పొందిన ఎం.రామ్ భూపాల్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన అనంతరం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ క్యాలెండర్ ను ఆయనకు బహుకరించడం జరిగింది.

Share this content:

Post Comment