నాట్యం ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రామ్ చరణ్

రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో సంధ్య రాజు ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం నాట్యం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, నిష్రింకల ఫిల్మ్స్ బ్యానర్ ల పై దిల్ రాజు, సంధ్య రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోటంతో పాటు సినిమా పై అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గాచేయటానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ ను ఆహ్వానించారు. అక్టోబర్ 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.