రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి

వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న శ్రీ రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే… ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు శ్రీ రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత… శ్రీ రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Share this content:

Post Comment