జిల్లా కార్యాలయంలో ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

కడప: మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కో-ఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి రామ్ చరణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ, రామ్ చరణ్ ఒక గొప్ప నటుడిగా మాత్రమే కాకుండా, ఒక మంచి వ్యక్తిగా, సమాజానికి సేవ చేయాలనే తత్వంతో ముందుకు సాగుతున్న యువ నాయకుడిగా ఎదుగుతున్నారని ప్రశంసించారు. ఆయన తన సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించి ప్రేక్షకులను అలరించడంతోపాటు, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని గౌరవంగా కొనసాగిస్తున్నారని అన్నారు. రామ్ చరణ్ ఆయన సేవా కార్యక్రమాలు, విపత్తుల సమయంలో ప్రజలకు అందిస్తున్న సహాయం, ప్రత్యేకించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ఆయన ముందుకు సాగుతున్న విధానం గురించి సుదీర్ఘంగా ప్రస్తావించారు. దేశ, విదేశాల్లో తెలుగు సినీ పరిశ్రమను మరింత గొప్పగా చాటిచెప్పేలా ఆర్.ఆర్.ఆర్, రంగస్థలం వంటి సినిమాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్, ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఫిల్మ్ ప్రొడక్షన్, సామాజిక సేవ వంటి వివిధ రంగాల్లోనూ తనదైన ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వేడుకలో జనసేన జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తివిశ్వనాధ్, నగర అధ్యక్షులు బొరెడ్డి నాగేంద్ర, నగర కార్యదర్శులు చార్లెస్, నిమ్మలపల్లి వెంకటేష్, కొవ్వూరి అశోక్, తరుణ్, రాజకీయ కార్యదర్శి ఫ్రాన్సిస్ మరియు ఆలీ తదితరులు మరియు ఇతర జనసేన పార్టీ ముఖ్య నేతలు, అభిమానులు, కార్యకర్తలు, సినీ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, రామ్ చరణ్ చిరస్మరణీయ పాత్రలు, సేవా కార్యక్రమాలు, ఆయన సమాజానికి అందిస్తున్న సహాయం గురించి మరింత చర్చిస్తూ, ఆయనకు మరిన్ని విజయాలు అందాలని ఆకాంక్షించారు.

Share this content:

Post Comment