ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

కడప: మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి రామ్ చరణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ, రామ్ చరణ్ గొప్ప నటుడిగా మాత్రమే కాకుండా, సమాజ సేవకు అంకితభావంతో పనిచేస్తున్న యువ నాయకుడిగా ఎదుగుతున్నారని ప్రశంసించారు. సినీ పరిశ్రమలో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారసత్వాన్ని గౌరవంగా కొనసాగిస్తున్నారన్నారు.రామ్ చరణ్ గారి సేవా కార్యక్రమాలు, విపత్తుల సమయంలో అందిస్తున్న సహాయం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ఆయన ముందుకు సాగుతున్న విధానం గురించి వివరించారు. “ఆర్.ఆర్.ఆర్”, “రంగస్థలం” వంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ గారు నటుడిగా మాత్రమే కాకుండా, ఫిల్మ్ ప్రొడక్షన్, సామాజిక సేవ వంటి రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఈ వేడుకలో జనసేన జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తివిశ్వనాధ్, నగర అధ్యక్షులు బొరెడ్డి నాగేంద్ర, నగర కార్యదర్శులు చార్లెస్, నిమ్మలపల్లి వెంకటేష్, కొవ్వూరి అశోక్, తరుణ్, రాజకీయ కార్యదర్శి ఫ్రాన్సిస్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ముఖ్య నేతలు, అభిమానులు, కార్యకర్తలు, సినీ ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరై రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, రామ్ చరణ్ గారి చిరస్మరణీయ పాత్రలు, సేవా కార్యక్రమాలు, సమాజానికి అందిస్తున్న సహాయంపై చర్చిస్తూ, ఆయనకు మరిన్ని విజయాలు అందాలని ఆకాంక్షించారు.

WhatsApp-Image-2025-03-27-at-2.09.16-PM-1-1024x768 ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

Share this content:

Post Comment