జనసేన నాయకులు ఆధ్వర్యంలో మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు కొత్తవలసలో కుమ్మరి బంజరిలో గల స్థానిక శ్రేష్ఠ పౌండేషన్లో సందడిగా వేడుకలు సాగాయి. ముందుగా కేకు కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం చిన్నారులకు పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత జాయింట్ సెక్రటరీ నూతన నాగేంద్ర, జనసేన పార్టీ నాయకులు కొత్తవలస మండలం అధ్యక్షులు గాలి అప్పారావు, జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను, కొత్తవలస మండలం కార్యదర్శిలు రామ్ దాస్ కాశీ, బంధం సత్య నారాయణ కార్యదర్శి ఆనంద్, మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment