పాలకొల్లు నియోజకవర్గం, మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన వేడుకలు పాలకొల్లు పట్టణ చిరు, పవన్ యువత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పూలపల్లిలోని సి.వి.ఎన్.ఆర్ & ఎల్.ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధుల ఆశ్రమంలో రామ్ చరణ్ బర్త్ డే కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపిణీ చేసి అనంతరం వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వర రావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు శిడగం సురేంద్ర, చిరంజీవి యువత ఆచంట చరణ్ దీపు, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామాయణం మణికంఠ, సాధనాల దుర్గబాబు, బిట్టా లక్ష్మీనారాయణ, చేబ్రోలు కృష్ణమోహన్, కొమ్ముల దినేష్, విన్నకోట గోపి, సాంబ, కోట్ల నవీన్, పినిశెట్టి శ్రీను, రాపాక నందియ్య, మల్లిపూడి జగదీష్, భాను, సాయి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment