అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఆదేశాల మేరకు, కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్, మైదుకూరు జనసేన పార్టీ నాయకులు గోగు లక్ష్మీ భరత్ ఆధ్వర్యంలో కడప ప్రకాశ్ నగర్ జె.ఎస్.ఓ.యస్ చిల్డ్రన్స్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారిని శాలువాతో సత్కరించి, ఆతిథ్య సత్కారం చేశారు. అనంతరం చిల్డ్రన్స్ హోమ్ లోని సుమారు 150 మంది చిన్నారులకు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జీవి రమణ, తుంగ రమణయ్య, తెలుగు జర్నలిస్ట్ ఫోరం జిల్లా కన్వీనర్ ఉప్పు శ్రీకాంత్, అబ్బన్నగారి రాజగోపాల్, శేషు రాయల్, నాగరాజు, తిరుమలశెట్టి సిద్ధార్థ, తోట సుమన్, వంశీకృష్ణ, హుస్సేన్, బాలునాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, సాయికృష్ణ ఆచారి, అతికారి నాగేంద్ర, గోపాల్ నాయక్ తదితర మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ కార్యకర్తల సమక్షంలో ప్రజాహిత కార్యక్రమాల ద్వారా చారిత్రాత్మకంగా జరిపినందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారు.
Share this content:
Post Comment