కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ మరియు కడప జనసేన పార్టీ నాయకులు అబ్బన్నగారి రాజగోపాల్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహణ. వారోత్సవాల్లో భాగంగా కడప నగరంలోని మరియాపురం సర్కిలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. బిజెవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, తెలుగు జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు ఉప్పు శ్రీకాంత్, శ్రీ గణేష్ ఆటో ఫైనాన్స్ అధినేత ఉప్పు శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్బన్న గారి రాజేంద్ర, వినోద్ కుమార్, రాజశేఖర్, బాలునాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, సాయి కృష్ణ ఆచారి, అతికారి నాగేంద్ర, గోపాల్ నాయక్, బీజేవైఎం నాయకులు సురేంద్ర, ఇతర ముఖ్య నాయకులు, మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment