శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో పాల్గొన్న యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: కృత్తివెన్ను మండలం, ఒర్లగొందితిప్ప గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈ వేడుకలలో పెడన నియోజకవర్గ జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జనసేన మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి ఒడుగు ప్రభాస్ రాజు ఆహ్వానం మేరకు జాతర సంధర్భంగా ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, కూనపరెడ్డి రంగయ్య, క్రోవి సుందర రాజు, బుద్దన బాబీ, జిల్లా కార్యదర్శి కూనసాని నాగబాబు, బంటుమిల్లి మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శిలు ఒడిమి ఆశీర్వాదం, చంద్రమౌళి, కృత్తివెన్ను మండల కార్యదర్శులు కొప్పినీటి నరేష్, కాజ మణికంఠ, ఉపాధ్యక్షులు నాగ మల్లేశ్వరరావు, బాడిత నాగబాబు, నాగు కునసాని, మరియు స్ధానిక జనసైనికులు పాల్గొన్నారు.