అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలంలోని బెస్తపల్లి సమీపంలోని బండకాడ ఈడిగపల్లిలో శ్రీశ్రీశ్రీ నాగరపమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. జాతర సందర్భంగా జనసేన కార్యకర్తలు, మద్దతుదారులు, భక్తులు అందరూ కట్టిన విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడిన జోడ్డెద్దుల చాందని బండ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బోనాలు సమర్పిస్తూ చెక్కభజనలు, కోలాటాలు, డప్పులు, డీజెలు, బాణసంచాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, జనసేన శ్రేణులు, కూటమి నేతలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ప్రత్యేక ఆకర్షణలతో భక్తులు ఆనందోత్సాహాలతో జాతరను తిలకించారు.
Share this content:
Post Comment