అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వెంకట చలపతి ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సందర్భాలలో అనవసరంగా పలు అంశాలపై చోటు చేసుకున్న సంఘటనల విషయాలకై ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రాయచోటి పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా అన్ని విధాలుగా శాంతిభద్రతల పరిరక్షణకై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలంటూ అదేవిధంగా ఫిర్యాదులు పట్ల బాధితులకు మరియు బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాన్యులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి జనసేన యువ నాయకులు బుల్లెట్ విజయ్, వెంకటేష్, శ్రీకాంత్, బాషా, రవితేజ సాయి తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment