మహా న్యూస్ ఛానెల్ పై దాడిని ఖండించిన రామ శ్రీనివాస్

హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడిని ఖండిస్తూ, జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన ఆయన, ప్రజలకు సమాచారం అందించే మీడియా వ్యవస్థను అణచివేయడం సమాజానికి హానికరమని హెచ్చరించారు. మీడియా కథనాలపై అభ్యంతరాలుంటే, అబ్జెక్షన్ తెలిపే చట్టపరమైన మార్గాలున్నాయని, దాడులు మాత్రం గుండాగిరి చర్యలుగా భావించాల్సిందేనని రామ శ్రీనివాస్ అన్నారు. ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా నిలిచే మీడియాపై దాడులు సమాజాన్ని వెనక్కి నెట్టి ప్రజాస్వామ్యాన్ని ముప్పుకు గురిచేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖను కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని స్పష్టం చేశారు. ఈ ఘటనను అన్ని స్థాయిల్లో ఖండించాలని ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment