నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం నగరిపల్లిలోని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీయే కూటమి అభ్యర్థి మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో.. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ జనసేన శ్రేణులు పలువురు కూటమి నేతలతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం వ్యాప్తంగా పలు రకాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. అదేవిధంగా పీలేరు, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలకు సంబంధించి సరిహద్దుల్లో ఉన్న జరికొన ప్రాజెక్ట్ తూము మఱమతులు తక్షణమే చేపట్టాలని విన్నవించారు. అలానే రానున్న వేశవికళాన్ని దృష్టిలో పెట్టుకుని టి.సుండుపల్లి మరియు సంబేపల్లె మండలాలకు సంబంధించి త్రాగునీరు సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు నీటి సంఘం అధ్యక్షులు టి. ఆనందరెడ్డి, నంద్యాల సిద్దయ్య, రవీంద్ర, వేణు, శేఖర్ తదితర జనశైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment