పాముల చంద్రమౌళి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట: అన్నమయ్య జిల్లా (ఉమ్మడికడపజిల్లా), టి. సుండుపల్లి మండల పరిధిలోని రాయవరం గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు, క్రీడాకారుడు, మాజీ హోంగార్డు మరియు తరుణం రిపోర్టర్ పాముల చంద్రమౌళి దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి రాజంపేట అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, జనసైనికులు, ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.