హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల పరిధిలో పెద్దబలిజపల్లి గ్రామంలో గుట్టకాడ బలిజపల్లి నందు దేవరగుట్ట మీద వెలసిన శ్రీశ్రీశ్రీ రామాంజనేయస్వామి వారి తిరుణాల మహోత్సవంలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం మరియు హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అలానే జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చన చేయించి ఆ దేవదేవుడు ఆశీర్వదాలతో మెజారిటీ ప్రజల అందరి దృష్టి మలించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు చేకూరి, ఆయన చేస్తున్న పోరాటంలో రాజకీయంగా విజయం సాధించి రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం సేవలందించాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత కుటాలగారి వెంకటయ్య, ఆలయ ధర్మకర్త రెడ్డిచెర్ల నాగయ్య, కమిటీ సభ్యులు రామకృష్ణ, సిద్దయ్య, అంజి, నాగరాజ, ముని, రమణ, వెంకటయ్య, ప్రసాద్, శివ, కిరణ్, నరేష్, గ్రామపెద్దలు, జనసైనికులు, మహిళలు, యువకులు, స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, గ్రామప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.