డి.కరుణాకర్ రాజుకు నివాళులు అర్పించిన రామ శ్రీనివాస్

రాజంపేట పట్టణం సుదర్శన్ నగర్ సుదర్శన్ తియేటర్ ఎదురుగా ఉన్న సందులో నివాసముంటున్న ఉమ్మడి కడపజిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు దొడ్డిపల్లి కరుణాకర్ రాజు దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా ఆదివారం రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ జనసేన మరియు కూటమి నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సతీమణి శ్రీమతి ఛాయాదేవిని మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత యర్రంరాజు సురేష్ రాజు జనసేన శ్రేణులు అబ్బిగారి గోపాల్, జి.శ్రీనివాసరాజు, డి.వంశీ రాజు, రెడ్డిశేఖర్, వంశీ, సంతోష్, తేజ, శ్రీధర్, చిన్న తదితర కూటమి నాయకులు, పలువురు ప్రముఖులు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment