అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ప్రభుత్వ ఏరియల్ ఆసుపత్రిలో రమ మృతదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ సోమవారం పీజిఆర్ఎస్ కార్యక్రమానికి వస్తుండగా సంబేపల్లి మండలం, ఎర్రగుంట్ల సమీపంలో ఇరువైపులా ఎదురెదురుగా రెండు కార్లు రోడ్డు ప్రమాదం జరిగి మృతి చందడం చాలా బాధాకరమంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నారు. తదనంతరం గాయపడిన వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన విషయానికి గల కారణాలు సమీపంలో ఉన్న వారితో పాటుగా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు జనసేన, కూటమి శ్రేణులు బుల్లెట్ విజయ్, నిర్మల్, జి.శ్రీనివాసరాజు, చెన్నకృష్ణ, వెంకటేష్, ప్రకాశ్, సురేష్, కార్తీక్, సంజయ్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment