అన్నమయ్య జిల్లా నందలూరు మండలంకు చెందిన బాధితులకు పరిష్కారం కోసం రాజంపేట పార్లమెంటరీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. నందలూరు మండలం టంగుటూరు, పొత్తపి గ్రామాలకు చెందిన బెడుదూరి రమణయ్య – రేషన్ కార్డు సమస్య, కోడూరు సుబ్బమ్మ – సూర్య గ్రూపులో తనకు రావలసిన డ్వాక్రా డబ్బులు యానిమేటర్ మోసం చేసి తినేసిందని, ఎన్ని సార్లు అడిగినా న్యాయం జరలేదని వేదన చెందుతూ ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న రామ శ్రీనివాస్, బాధితులకు న్యాయం చేయాలన్న దృక్పథంతో జిల్లా కలెక్టర్ ని స్పందనా కార్యక్రమంలో కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ బాధితుల సమస్యలకు వెంటనే పరిస్కారం చెయ్యాలని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు.
Share this content:
Post Comment