మంగళగిరి జనవాణి కార్యక్రమం నందు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరియు ప్రజాదర్భార్ కార్యక్రమం నందు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడులకు విరివిగా వినతి పత్రాలు సమర్పించిన రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం టి సుండుపల్లి గ్రామం చెన్నం శెట్టి పల్లి గ్రామస్తులు ప్రతి ఏటా సంక్రాతి పండుగ సందర్భంగా కనుమ రోజున ఆ ఊరి దగ్గరలో చిట్లకుప్ప వేసి పశువులు పండుగను అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా సుండుపల్లి తో పాటు వివిధ గ్రామాల నుండి పలు దూర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు అందరూ కలిసి జరుపుకుంటారు. ఎన్నో తరాల నుండి సర్వేనెంబర్ 2103/4 నందు0.45 సెంట్ల భూమిని ఆ గ్రామ ప్రజలు పశువులు పండగ కార్యక్రమానికి వినియోగించుకుంటారు. అయితే ఆ భూమి చుండుపల్లె టౌన్ కు చాలా దగ్గరగా ఉంది. ఇది చాలా విలువైన భూమి డాట్ లాండ్ (చుక్కల భూమి) సర్వే నంబర్ 2103/4కు చెందిన 0.40 సెంట్ల భూమిని కాజేయాలని ఉద్దేశ్యముగా అదే చిన్నంశెట్టిపల్లి గ్రామానికి చెందిన చిన్నంశెట్టి నారాయణ తండ్రి వెంకటప్ప, చెన్నం శెట్టి రామచంద్ర తండ్రి నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ గ్రామానికి చెందిన చదువురాని ఏపూరి నరసింహులు తండ్రి ఓబులేసు మరియు జంగిలి నరసింహులు అను ఇద్దరు వ్యక్తులు తీసుకొని పోయి తప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకొని పోయి ప్రస్తుతం ఆ స్థలంలో పశువులు పండగ చేసుకోకుండా అడ్డుపడి ఆ భూమిని ఆక్రమించుకుని ఆ భూమి చుట్టూ ఇనుప కంచేవేసి వేసి 0.40 సెంట్ల భూమిని కబ్జా చేసినారు. కావున విలువైన భూమిని కబ్జాదాల నుండి విముక్తి చేసి చెన్నైశెట్టిపల్లి గ్రామ రైతులకు మరియు భక్తులకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ అదేవిధంగా తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దుచేసి ఆ భూమిని గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ చేసుకొనుటకు చిట్లకుప్ప, కాటంరాజు, గుడికి అప్పజెప్పాలని మనవి చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నంశెట్టిపల్లి గ్రామపెద్దలు రామంజులు వెంకటరమణ నాగేష్ ఓబులేసు రమణ జయరామ్ పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment