క్షతగాత్రులను పరామర్శించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాయచోటి నుండి టి.సుండుపల్లి రోడ్డుపై శిబ్యాలకు సమీపాన ట్రక్కు బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వ్యక్తులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వివరాలు రాయచోటి మాధవరం నుండి సుండుపల్లికి పెళ్లి సారి ఎత్తుకొని ట్రక్కులో సుమారు 15మంది ప్రయనిస్తుండగా శిబ్యాలకు సమీపంలో సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ గాయాలయిన వారికి మనోధైర్యం కల్పిస్తూ మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పవన్ కుమార్, చరణ్, రెడ్డిప్రసాద్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-23-at-9.18.05-PM-1-1024x768 క్షతగాత్రులను పరామర్శించిన రామ శ్రీనివాస్

Share this content:

Post Comment