నాగయ్య నాయుడిని పరామర్శించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, టి.సుండుపల్లి మండలం, కొలిమిట్ట గ్రామానికి చెందిన వంగడ్డ నాగయ్య నాయుడు ఇటీవల తన వ్యవసాయ మామిడి తోటను పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంగా అడవికి సమీపంలో ఉన్న పొదల నుంచి వచ్చిన ఎనుగుదెబ్బకు తీవ్రంగా గాయపడ్డారు. తల, మొఖం, చేతులు, కాళ్లకు తీవ్రమైన గాయాలవడంతో కుటుంబ సభ్యులు అతన్ని అత్యవసరంగా బెంగళూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల శ్రద్ధతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగై 70% కోలుకొని స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ కొలిమిట్ట గ్రామానికి వెళ్లి వంగడ్డ నాగయ్య నాయుడిని స్వయంగా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. పరామర్శ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఇలాంటి ప్రమాదాలపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో అడవుల సమీపంలో వ్యవసాయ పనుల నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం” అని ప్రజలకు సూచించారు.

Share this content:

Post Comment