సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అంగరంగ వైభవంగా జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలతో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, జనసేన పార్టీ వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లి, కొత్త తరానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తెలియజేస్తూ, రాష్ట్రాభివృద్ధి మరియు దేశ పురోగతిపై దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. అయితే, బోడె రామచంద్ర యాదవ్ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించే స్థాయిలో లేరని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం, రథాల కాల్చివేత వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ యుద్ధం చేశారని, హిందూ ధర్మాన్ని కాపాడడంలో ఆయన చేసిన కృషి ఎంతగానో ప్రశంసనీయం అని సురేష్ నాయుడు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం కారణంగానే కూటమి ప్రభుత్వం విజయవంతమైందని, ఇది రాష్ట్రానికి, రైతులకు, యువతకు న్యాయం చేయడంలో మరియు అన్ని విధాల అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో వెంకటాచలం మండల నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, రామిరెడ్డి, మణి మరియు ఇతరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment