మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ

  • జనసేన పార్టీ సిటీ ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ

రాజమహేంద్రవరం, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండగ అని జనసేన పార్టీ సిటీ ఇన్చార్జ్ అను శ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం దానవాయి పేటలోని మదీనా మసీదు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ… ముస్లింలకి ఎంతో పవిత్ర మైన మాసం ఈ రంజాన్ మాసం అని పేర్కొన్నారు. ఇస్లాం మతం పాటించే ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు నా తరుపున జనసేన తరుపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 40 రోజులు ఉపవాస దీక్షలు నియమ నిష్టలతో కఠినంగా ఉపవాసం ఉండే మీకు అల్లా ఆశీస్సులు ఉండాలి అని ఆకాంక్షించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు ఒక ముస్లిం అర్హంఖాన్ అని తెలిపారు. ముస్లిం అంటే మైనారిటీ అంటారు గాని మీ ప్రేమ ఆప్యాయత మెజారిటీతో ఉంటుందని కొనియాడారు. మీ పిల్లల విద్య వైద్యంలో నేను గాని జనసేన పార్టీ గాని ఎప్పుడూ మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదానికి ఒక్క ఉదాహరణ “ఒక్క మస్జీద్ కూలిస్తే కాశీలో ఆవుని చంపినంత పాపం” అంత పవిత్ర స్థలం మసీద్ అంటే అని పేర్కొన్నారు. అల్లా హు అక్బర్ అని మీరు అన్నప్పుడు నాకు ఒక్కటే అనిపిస్తుంది “మీరు కాదు నేను కాదు అంత భగవంతుడే “అవును అది సత్యం అని అన్నారు. ఉపవాసం అంటే మనల్ని మనము నియంత్రంచుకోవడం చాలా గొప్ప విషయం అని వివరించారు. చివరిగా ఇది మీరు ఉపవాసం తర్వాత తాగే “అష్ “అంటే నాకు చాలా ఇష్టం, బూందీ వేసుకొని చాలా ఇష్ట పడే వాడిని మా వాళ్ళు ఇచ్చే వారని తెలిపారు. మీకు మీ కుటుంబం సభ్యులకు నేను, జనసేన పార్టీ కానీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గెడ్డం నాగరాజు. పొన్నాడ శీను. నగర కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, పైడ్రాజు ,అల్లాటిరాజు, గున్నం శ్యాంసుందర్, విన్నా వాసు, ఫణి ఠాగూర్, వేణు, నగర నాయకులు, సూర్య, కర్ణ, రాంబాబు, అవినాష్, వెంకట్, విక్టరీ వాసు, కుంది రాము, భీమరాజు, పి శ్రీను మరియు జనసైనికులు పాల్గొన్నారు.