‘రామరాజు ఫర్ భీమ్’ సరికొత్త రికార్డుల మోత

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్‌చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా మార్చిలో విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో యూట్యూబ్‌లో దుమ్మురేపింది.

దసరా సందర్భంగా విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ వీడియో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. ఈ స్థాయిలో కామెంట్లు దక్కించుకున్న టీజర్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు లేదు. అలాగే ఈ వీడియో ఇప్పటివరకు 3 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 11 లక్షల లైకులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ మూవీ ఇంకెలా ఉంటుందో అన్న సంతోషం అభిమానుల్లో వ్యక్తంమవుతుంది.