ఎమ్మిగనూరులో ఘనంగా రాంచరణ్ 39వ జన్మదిన వేడుకలు

ఎమ్మిగనూరు, రాంచరణ్ 39వ జన్మదిన వేడుకలలో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు రాహుల్ సాగర్, ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రామస్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమం నిర్వహించి దివ్యాంగులకు బట్టల పంపిణీ మరియు కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన ఏకైక నటుడు రామ్ చరణ్ గారిని రామ్ చరణ్ గారి సేవాగుణం ఎందరో యువకులకు ఆదర్శమని భవిష్యత్తులో రామ్ చరణ్ గారు చేపట్టిపోయే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని అదేవిధంగా ప్రతి ఒక్క సినిమా దిగ్విజయం సాధించాలని మెగాస్టార్ చిరంజీవి గారి లాగా ఎనలేని కీర్తి అభిమానం మన రామ్ చరణ్ గారి సొంతం కావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, రషీద్, ప్రకాష్, ఎర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.