చిరంజీవి యువత మరియు అంజనీ పుత్ర ఆధ్వర్యంలో రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు

  • ముఖ్యఆతిధిగా హాజరైన జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, డిస్ట్రిక్ట్-102 గవర్నర్ కర్రోతు సత్యం
  • సర్వమత ప్రార్థనలు,మొక్కలు నాటడం, నేత్ర వైద్య శిబిరం, ఆహార పొట్లాలు పంపిణీ చేసిన యువత
  • మెగా ఫ్యామిలీ అభిమానులను కొనియాడిన గురాన, కర్రోతు

విజయనగరం: ప్రముఖ యువ నటుడు, మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలను సోమవారం నాడు విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీ పుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం మరియు అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), అంజనీ పుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం అధ్యక్షుడు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్ నిర్వహించారు. ముందుగా రాంచరణ్ గోత్రనా మాలతో కామాక్షి నగర్ లో శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు సర్వమత ప్రార్ధనలు నిర్వహించి, కామాక్షి నగర్ రెండువ లైన్ లో మొక్కలు నాటారు. అనంతరం కామాక్షి నగర్ లో ఉన్న శ్రీ ప్రసన్న స్కూల్లో పుష్పగిరి కంటి ఆసుపత్రి సౌజన్యంతో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ నేత్ర వైద్య శిబిరానికి ముఖ్యఅతిధిలుగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గురాన అయ్యలు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కర్రోతు సత్యం హరయ్యారు. గురాన అయ్యలు కేక్ కట్ చేసి విద్యార్థినీ విద్యార్థులకు బిస్కెట్స్, చాక్లెట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిలుగా హాజరైన గురాన అయ్యలు, కర్రోతు సత్యం మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మెగాఫ్యామిలీ అభిమానులు సేవల్లో ముందుంటారని, దీనికి నిదర్శనం ప్రపంచ వ్యాప్తంగా చిరంజీవి అభిమానులు ఉన్నారని, ఇప్పటికే వెలకట్టలేని సేవాకార్యక్రమాలు మెగాభిమానులు చేస్తున్నారని, రాంచరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో పాటకు ఆస్కార్ తో ప్రపంచ ఖ్యాతి పొందిన తరుణంలో ఈ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక మైనవని, అంజనీ పుత్ర జిల్లా చిరంజీవి యువత చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం కంటోన్మెంట్ లోఉన్న పలువురు నిరాశ్రుయులకు ఆహార పొట్లాలను కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, నలమారాజు, లోక్ నాథ్ పంచిపెట్టారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి జిల్లా కంటి వైద్య శిబిరాల కో ఆర్డినేటర్ పి.సురేష్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్ బి.హేమలత సేవలందించిన ఈ శిబిరంలో,శ్రీ ప్రసన్న స్కూల్ ఉపాధ్యాయులు మహేష్, శివాజీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, రాష్ట్ర గిరిజన, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర, ప్రగతి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, చిరంజీవి యువత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు లాలిశెట్టి రవితేజ, ఎంటి రాజేష్, పవన్, చుక్క రవికుమార్, భాష, రవి, అప్పన్న తదితరులు హాజరయ్యారు.